సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీకి ఉప ఎన్నిక ఎప్పుడంటే?

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచింది. దీంతో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.

By Medi Samrat  Published on  16 March 2024 5:13 PM IST
సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీకి ఉప ఎన్నిక ఎప్పుడంటే?

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచింది. దీంతో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీకి మే 13న ఉప ఎన్నిక నిర్వహించనున్నారు.

ఇక బీఆర్ఎస్ ఇంకా అభ్యర్థిని అధికారికంగా ప్రకటించలేదు. లాస్య నందిత సోదరి నివేదిత తాను కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో పోటీచేస్తానని తెలిపారు. కార్యకర్తలు, అభిమానులతో సమావేశం అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు స్పష్టం చేసారు. క్యార్యకర్తలు, కంటోన్మెంట్‌ ప్రజలు కోరిన తర్వాతే పోటీ నిర్ణయం తీసుకున్నానని.. నాన్న సాయన్నను, చెల్లి లాస్యనందితను ఆదరించినట్లుగానే కంటోన్మెంట్‌ ప్రజలు తనను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు.

Next Story