బీఆర్ఎస్ ఎల్పీ భేటీ.. ఎప్పుడంటే.?

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో శ‌నివారం ఉద‌యం 9 గంట‌ల‌కు బీఆర్ఎస్ ఎల్పీ భేటీ జ‌ర‌గ‌నుంది.

By Medi Samrat  Published on  8 Dec 2023 7:30 PM IST
బీఆర్ఎస్ ఎల్పీ భేటీ.. ఎప్పుడంటే.?

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో శ‌నివారం ఉద‌యం 9 గంట‌ల‌కు బీఆర్ఎస్ ఎల్పీ భేటీ జ‌ర‌గ‌నుంది. తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌ర‌గ‌నున్న ఈ భేటీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంద‌రూ హాజ‌రు కానున్నారు. ఇటీవల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాల‌ను గెలుపొందింది.

శ‌నివారం ఉద‌యం 11 గంట‌ల‌కు తెలంగాణ మూడో అసెంబ్లీ ప్రారంభం కానుంది. స‌మావేశం ప్రారంభం అనంత‌రం కొత్త‌గా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్ర‌మాణ‌స్వీకారం జ‌ర‌గ‌నుంది. నూత‌న స‌భ్యుల‌తో ప్రొటెం స్పీక‌ర్ ప్ర‌మాణ‌స్వీకారం చేయించ‌నున్నారు. ఈ స‌భ‌లో ప్రొటెం స్పీక‌ర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఒవైసీ వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. శ‌నివారం ఉద‌యం 8:30 గంట‌ల‌కు రాజ్‌భ‌వ‌న్‌లో అక్బ‌రుద్దీన్ ఒవైసీ చేత ప్రొటెం స్పీక‌ర్‌గా గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ప్ర‌మాణం చేయించ‌నున్నారు.

Next Story