జీవన్ రెడ్డికి ఆ హామీ ఇచ్చిన కేటీఆర్..!

కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ నాయకులు టీ.జీవన్ రెడ్డి నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నారు.

By -  Medi Samrat
Published on : 9 April 2026 6:10 PM IST

జీవన్ రెడ్డికి ఆ హామీ ఇచ్చిన కేటీఆర్..!

కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ నాయకులు టీ.జీవన్ రెడ్డి నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డిని కేటీఆర్ స్వయంగా కలిసి, ఆయనను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ పర్యటనలో కేటీఆర్ వెంట ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కీలక నేతలు, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తదితరులు ఉన్నారు. జీవన్ రెడ్డి పార్టీలోకి వస్తే ఆయనకు సముచిత గౌరవం, బాధ్యతలు కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

జీవన్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని జీవన్ రెడ్డి అన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనతో పోలిస్తే, కేసీఆర్ నేతృత్వంలోని పదేళ్ల బీఆర్ఎస్ పాలనే చాలా బాగుందని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదని, ఆయన పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని విమర్శించారు.

Next Story