ఇందారం వద్ద ఎండిపోయిన గోదావరిని పరిశీలించిన కేటీఆర్

బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు కాళేశ్వరం ప్రాజెక్టులను రెండ్రోజులుగా సందర్శిస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  26 July 2024 5:42 AM GMT
brs,   ktr, godavari river ,

ఇందారం వద్ద ఎండిపోయిన గోదావరిని పరిశీలించిన కేటీఆర్

బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు కాళేశ్వరం ప్రాజెక్టులను రెండ్రోజులుగా సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ నేతృత్వంలోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం.. గురువారం సాయంత్రం కరీంనగర్‌లోని లోయర్ మానేరు రిజర్వాయర్‌ను పరిశీలించారు. శుక్రవారం ఉదయం ఎన్టీపీసీ నుంచి కన్నెపల్లికి బయల్దేరిన ఈ బంధం.. మంచిర్యాల జిల్లా ఇందారం వద్ద నీటి ప్రవాహం లేక ఎండిపోయిన గోదావరి నదిని పరిశీలించారు.

గోదావరిఖనిలో సింగరేణి క్వాటర్ల కూల్చివేత బాధితులు కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్బంగా తమ గోడును కేటీఆర్‌ ముందు చెప్పుకొన్నారు. గోదావరిఖని లక్ష్మినగర్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ డెవలప్‌మెంట్‌ అంటూ సింగరేణి క్వాటర్లు కూల్చివేశారని కేటీఆర్ ముందు వాపోయారు. 82 క్వాటర్లకు కరెంటు, నీళ్లు కట్‌ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ ఠాకూర్‌ మక్కన్‌సింగ్‌ అరాచక పాలన చేస్తున్నారని కేటీఆర్‌కు కంప్లైంట్ చేశారు. ఏ ప్రజా ప్రతినిధులు ఇలాంటి పనులు చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తమ సమస్యలను.. ఇబ్బందులను అసెంబ్లీలో వినిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందానికి విన్నపం పెట్టుకున్నారు. బాధితుల విజ్ఞప్తిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. అలాగే అసెంబ్లీలో పోరాడుతామని కేటఆర్ హామీ ఇచ్చారు.

Next Story