కేసీఆర్‌ రైతును రాజు చేస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాణం తీస్తోంది: కేటీఆర్

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla  Published on  12 Sept 2024 10:34 AM IST
కేసీఆర్‌ రైతును రాజు చేస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాణం తీస్తోంది: కేటీఆర్

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదంటూ విమర్శించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.

రుణమాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కొందరు రైతులను మోసం చేసిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ కానందువల్ల రైతులు కొందరు ప్రాణాలు వదులుకోవడం ఆందోళనకరమని చెప్పారు. పెట్టుబడి సాయం లేక మరింకొందరు ప్రాణాలు వదిలారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ రైతును రాజు చేస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం వారి ప్రాణం తీస్తోందని ఆరోపించారు. రుణమాఫీ, రైతుభరోసా బోగస్‌ అంటూ విమర్శలు చేశారు కేటీఆర్. డిసెంబర్‌లో పెట్టిన డెడ్‌లైన్ సెప్టెంబర్ దాటుతున్నా అమలు కాకపోవడం దారుణమన్నారు. దగాపడ్డ రైతులు ఎవరికి చెప్పుకోలేక ప్రాణాలు తీసుకోవడంరాష్ట్రం ప్రభుత్వ వ్యవహారమే కారణమన్నారు. రేవంత్‌రెడ్డి ఢిల్లీ యాత్రలు చేయడం కాదు.. రాష్ట్రంలో ఏం జరుగుతోందో కూడా చూడాలంటూ హితవు పలికారు. అయితే.. రైతులు ధైర్యం కోల్పోవద్దనీ.. రైతుల తరుఫున బీఆర్ఎస్ పోరాడుతుందని చెప్పారు. దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దని ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు.



Next Story