3 నెలల్లో బీఆర్‌ఎస్ తుడిచిపెట్టుకుపోతుంది: భట్టి
రానున్న రోజుల్లో కాంగ్రెస్ బంగాళాఖాతంలో మునిగిపోతుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్
By అంజి Published on 6 Jun 2023 8:23 AM IST
3 నెలల్లో బీఆర్‌ఎస్ తుడిచిపెట్టుకుపోతుంది: భట్టి
హైదరాబాద్ : రానున్న రోజుల్లో కాంగ్రెస్ బంగాళాఖాతంలో మునిగిపోతుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి మండిపడ్డారు. ''మీలాంటి వందల మంది వచ్చినా.. మా పార్టీని మీరెవరూ ముట్టుకోలేరు.. మూడు నెలల్లో కాంగ్రెస్ పార్టీ మీ అధ్యాయాన్ని ఒక్కసారి మూసేస్తుంది'' అని కేసీఆర్‌పై భట్టి విక్రమార్క్ ఫైర్ అయ్యారు. 81వ రోజు పాదయాత్రలో భాగంగా సోమవారం అచ్చంపేట నియోజకవర్గంలోని ఇనోల్ బొమ్మనపల్లిలో జరిగిన కార్నర్‌మీటింగ్‌లో కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు.
త్వరలోనే బీఆర్‌ఎస్ పాలన నుంచి సమాజానికి విముక్తి లభిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అచ్చంపేట మండలం కొర్ర తండాలో మీటర్లు బిగించకుండా ఇష్టానుసారంగా కరెంటు బిల్లులు వసూలు చేస్తుండడంతో గ్రామం మొత్తం ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని తీర్మానం చేసిందన్నారు. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి మాట్లాడుతూ.. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సొంత తల్లికే ద్రోహం చేసినట్లుగా ఉన్నాయని అన్నారు. కర్ణాటకలో బీజేపీకి ఏ గతి పట్టిందో తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు కూడా అదే గతి పడుతుందని రవి అన్నారు.