భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ పార్లమెంటరీ సమావేశం ఈ నెల 29న ప్రగతి భవన్లో జరగనుంది. ఆదివారం మధ్యాహ్నాం 1 గంటకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో కేసీఆర్ వారికి దిశా నిర్ధేశం చేయనున్నారు. ఉభయ సభల్లో చర్చించబోయే పలు అంశాలు, పార్టీ తరఫున అనుసరించ వలసిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
కాగా.. బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి కేంద్రం నుంచి సరైన కేటాయింపులు లేవని కొంతకాలంగా బీఆర్ఎస్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.