బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ ఖాతాలు హ్యాకింగ్‌కు గురైనట్లు తెలిపారు. సైబర్ నేరగాళ్లు మంగళవారం నాడు రాత్రి 10 నుంచి బుధవారం ఉదయం 11 గంటల వరకూ వరుసగా పలు సార్లు హ్యాకింగ్ కు యత్నించినట్లు ఆమె ప్రకటన ద్వారా తెలియజేశారు.
అనుమానాస్పదంగా లాగిన్ అయ్యి దుండగులు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సంబంధం లేని ఒక వీడియోను పోస్టు చేశారు. వెంటనే గుర్తించిన కవిత తన సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్ కు గురైనట్లు ఎక్స్ ద్వారా వెల్లడించారు. డీజీపీకి, సైబర్ సెక్యూరిటీ విభాగానికి ట్యాగ్ చేశారు. సోషల్ మీడియా ఖాతాలను పూర్తి స్థాయిలో తిరిగి పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు.