సీఎం రేవంత్‌ నిరుద్యోగులకు ఇచ్చిన మాట తప్పారు: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భారత్ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

By Srikanth Gundamalla  Published on  8 March 2024 12:30 PM GMT
brs, mlc kavitha, comments,  telangana, congress government,

సీఎం రేవంత్‌ నిరుద్యోగులకు ఇచ్చిన మాట తప్పారు: ఎమ్మెల్సీ కవిత 

హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భారత్ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయం, జీవో-3 ను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. కాగా.. ఈ ధర్నా ముగిసిన తర్వాత ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. ఈ సందర్భంగా.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి మూన్నెళ్ల ముఖ్యమంత్రి అంటూ విమర్శలు చేశారు. రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ఏదో చేస్తాడని అనుకుంటుంది కానీ.. అతను రేసు గుర్రం కాదు.. గుడ్డి గుర్రం అంటూ సెటైర్లు వేశారు.

ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల వాటా మహిళలకు రావాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం అమలు చేసిన రిజర్వేషన్లు అమలు చేయాలన్ని డిమాండ్ చేశారు. రేవంత్‌ సర్కారు అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఇచ్చిన మాట తప్పిందంటూ మండిపడ్డారు. ఒక అమ్మాయి చనిపోతే రాజకీయానికి వాడుకున్నారని వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పు పేరు చెప్పి రేవంత్‌రెడ్డి తప్పించుకున్నారని అన్నారు. జీవో-3 నిజమైతే 30 వేల ద్యోగాల్లో ఎంత రిజర్వేషన్లు చేస్తారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు అయోమయంలో ఉన్నారని చెప్పారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

మహిళలతో పెట్టుకున్న ఎవరూ చరిత్రలో బాగుపడినట్లు లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. అలాగే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూడా మహిళలకు అన్యాయం చేస్తే ముందుకు సాగదని వార్నింగ్ ఇచ్చారు. అయితే.. తమ పోరాటం మహిళల కోసమే కానీ.. పురుషులను వ్యతిరేకిండచం కోసమ కాదని స్పష్టంగా చెప్పారు. ఈ మేరకు హారిజంటల్‌ పద్ధతిలో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు.

Next Story