ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికిన బీఆర్‌ఎస్ శ్రేణులు

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో 166 రోజుల పాటు తీహార్ జైలులో ఉన్న భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవితకు నిన్న సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో నేడు ఆమె హైద‌రాబాద్‌ నగరానికి చేరుకున్నారు

By Medi Samrat  Published on  28 Aug 2024 7:46 PM IST
ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికిన బీఆర్‌ఎస్ శ్రేణులు

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో 166 రోజుల పాటు తీహార్ జైలులో ఉన్న భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవితకు నిన్న సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో నేడు ఆమె హైద‌రాబాద్‌ నగరానికి చేరుకున్నారు. బుధ‌వారం సాయంత్రం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ)కి చేరుకున్న ఆమెకు బీఆర్‌ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆమె రాక సందర్భంగా పార్టీ కార్యకర్తలు విమానాశ్రయం నుంచి భారీ వాహన ర్యాలీ ఏర్పాటు చేశారు.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటుపై బుధవారం రోస్ అవెన్యూ కోర్టులో విచారణకు కవిత వర్చువల్‌గా హాజరయ్యారు. మార్చి 15న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ నివాసం నుంచి కవితను అరెస్ట్ చేసిన ఈడీ.. ఏప్రిల్ 11న తీహార్ జైలు నుంచి సీబీఐ అరెస్ట్ చేసింది. కవిత సుమారు ఐదు నెలల పాటు కస్టడీలో ఉన్నారని, ఈ కేసుల్లో ఆమెపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దర్యాప్తు పూర్తయిందని జస్టిస్ బిఆర్ గవాయ్, కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

Next Story