స్వర్ణకారుల వరుస ఆత్మహత్యలు కలచివేస్తున్నాయి : ఎమ్మెల్సీ కవిత
రాష్ట్రంలో కొందరు పోలీసుల పేరు చెప్పి స్వర్ణకారులను వేధింపులకు గురి చేస్తున్నారు..అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.
By Knakam Karthik
వారి ఆత్మహత్యలు కలచివేస్తున్నాయి: ఎమ్మెల్సీ కవిత
రాష్ట్రంలో కొందరు పోలీసుల పేరు చెప్పి స్వర్ణకారులను వేధింపులకు గురి చేస్తున్నారు..అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఈ మేరకు కవిత సెల్ఫీ వీడియోలో స్పందిస్తూ.. ఇటీవల కాలంలో వరుసగా జరుగుతోన్న స్వర్ణకారుల ఆత్మహత్యలు కలిచి వేస్తున్నాయి. విశ్వకర్మ వృత్తుల వారు యావత్ దేశానికే ఊపిరి పోస్తున్నవారు. కార్పొరేట్ సంస్థల ప్రవేశంతో ఆయా వృత్తులకు ఆదరణ తగ్గిపోయింది.. క్రమేణ వృత్తి పని చేస్తున్న వారికి ఉపాధి లేకుండా పోతుంది.. వారి జీవనం నడవడమే ఇబ్బందికరంగా మారింది. మన దేశంలో బంగారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.. నగలను ఎంతో పవిత్రగా చూస్తారు.. కేవలం స్వర్ణకారులే కాకుండా ఇతర కులాల వారు కూడా ఈ వృత్తిని ఉపాధిగా మార్చుకున్నారు. మహిళగా మెట్టెలు, మంగళసూత్రాలు చేయించాలంటే స్వర్ణకారుడి దగ్గరికి వెళ్తామే తప్ప పెద్ద పెద్ద షాపులకు వెళ్లం.. భారతీయులు పవిత్రంగా భావించే బంగారు, వెండి ఆభరణాలు తయారు చేసే స్వర్ణకారులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది. దొంగ బంగారం కొన్నారని పోలీసులు స్వర్ణకారులపై కేసులు పెట్టి వేధిస్తున్నారు.. ఆ బంగారం అమ్మిన దొంగలను మాత్రం పట్టుకోలేకపోతున్నారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక కొందరు స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవాలే తప్ప ఆత్మహత్యలు పరిష్కారం కాదు. నేను నిజామాబాద్ ఎంపీగా ఉన్న సమయంలో స్వర్ణకారులను పోలీసులు ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకున్నా.. స్వర్ణకారులను వేధింపులకు గురి చేస్తున్న 411 చట్టానికి సవరణలు చేయాలని డిమాండ్ చేస్తున్నా..అని కవిత వ్యాఖ్యానించారు.
తెలంగాణతో పాటు ఏపీలోనూ 411 చట్టం కింద కేసులు పెట్టి స్వర్ణకారులను వేధిస్తున్నారు.. ఎమ్మెల్సీగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా, బీసీల కోసం ఉద్యమిస్తున్న నాయకురాలిగా ఈ చట్టం సవరణ కోసం పోరాడుతా. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ హామీ ఇచ్చినట్టుగా స్వర్ణకారులతో పాటు అన్ని చేతివృత్తిదారులను ఆదుకునే చర్యలు చేపట్టాలి.. అప్పుడే వారు కార్పొరేట్ సంస్థలతో దీటుగా నిలబడగలుగుతారు. కొందరు పోలీసుల పేరు చెప్పి స్వర్ణకారులను వేధింపులకు గురి చేస్తున్నారు.. అలాంటి నకిలీ పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి.. లేదా మీ సమీపంలోని నాయకులను ఆశ్రయించండి తప్ప ఆత్మహత్యలు పరిష్కారం కాదు.. మీరు బతికి ఉంటేనే ఏదైనా సాధించగలమనేది గుర్తించాలి.. బిడ్డలకు మంచి భవిష్యత్ ఇవ్వగలమని గుర్తించండి.. సోదరిగా మీమ్మల్ని కోరుతున్న ఆత్మహత్యలు చేసుకోవద్దు..అని కవిత పేర్కొన్నారు.
స్వర్ణకారులపై వేధింపులు మానుకోవాలికేసులకు భయపడి స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకోవద్దుబంగారం వృత్తి చేసుకునే వారికి సర్కారు రుణాలు ఇవ్వాలికార్పొరేట్ సంస్థలతో పోటీ పడేలా విశ్వకర్మలకు చేయూతనివ్వాలి- ఎమ్మెల్సీ @RaoKavitha pic.twitter.com/utHyeHBeC9
— Kalvakuntla Kavitha Office (@OfficeOfKavitha) July 7, 2025