దివంగత ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించకపోవడంతో ఆయన అభిమానులు ఆందోళన చేశారు. సికింద్రాబాద్ మారేడుపల్లి శ్మశానవాటికలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే సాయన్న అంతిమ సంస్కారాలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరపాలని ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన నేపథ్యంలో మారేడుపల్లి శ్మశానవాటికలో జరుగుతోన్న ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు నిలిచిపోయాయి.
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని సాయన్న అనుచరులు డిమాండ్ చేశారు. చితిపై సాయన్న పార్థివదేహాన్ని ఉంచి ఆందోళనకు దిగారు. ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా అభిమానుల నినాదాలు చేశారు. దళిత ఎమ్మెల్యేకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయకుండా అవమానించారని నిరసనకు దిగారు. సాయన్న అంత్యక్రియల కార్యాక్రమాన్ని నిలిపివేసి ఆందోళనకు దిగారు. సాయన్న అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రులు అభిమానులను సముదాయించేందుకు ప్రయత్నించిన వారు వినకపోవడంతో శ్మశానవాటిక నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు.