మల్లారెడ్డి సవాళ్లు.. బీజేపీ నుండి ఏ రెస్పాన్స్ వస్తుందో..?

BRS minister Mallareddy challenges BJP chief Bandi Sanjay. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు బీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి సవాల్ విసిరారు.

By Medi Samrat
Published on : 23 Dec 2022 5:17 PM IST

మల్లారెడ్డి సవాళ్లు.. బీజేపీ నుండి ఏ రెస్పాన్స్ వస్తుందో..?
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు బీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలోనైనా ఉన్నాయో బండి సంజయ్ చూపించాలని అన్నారు. ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణ తరహా పథకాలు చూపిస్తే తన మంత్ర పదవితో పాటుగా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తాన్నారు. అక్కడితో ఆగనని రాజకీయ సన్యాసం కూడా స్వీకరిస్తానని ఛాలెంజ్ చేశారు. బండి సంజయ్ మా సీఎం కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులపై పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడని, ఏ రాష్ట్రానికి రమ్మంటే ఆ రాష్ట్రానికి వస్తానని తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూపించాలని మల్లా రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 12,700 గ్రామాలు అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. దేశంలో 19 రాష్ట్రాలు బీజేపీ పరిపాలిస్తుందని ఆ రాష్ట్రాల్లో రైతులకు ఉచిత కరెంట్, రైతు బంధు, తాగునీరు, సాగునీరు, హరితహారం వంటి తెలంగాణలో అమలవుతున్న కార్యక్రమాలు అమలు అయితే చెప్పాలని డిమాండ్ చేశారు మల్లారెడ్డి.


Next Story