రఘురామపై విమర్శలు గుప్పించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణ రాజు తాను ఎం పీగా ఉన్న సమయంలో థర్డ్ డిగ్రీ ప్రయోగించి, టార్చర్ చేశారంటూ కూడా గుంటురు పోలీసులకు ఫిర్యాదు చేశారు

By Medi Samrat  Published on  13 July 2024 5:00 PM IST
రఘురామపై విమర్శలు గుప్పించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణ రాజు తాను ఎం పీగా ఉన్న సమయంలో థర్డ్ డిగ్రీ ప్రయోగించి, టార్చర్ చేశారంటూ కూడా గుంటురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై గుంటూరు జిల్లా నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సమయంలో వైసీపీ ప్రభుత్వంలో ఐపీఎస్ అధికారి సునీల్ సీఐడీ డీజీగా పని చేశారు. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ దారుణంగా హింసించారన్నారు. గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు మేరకు 120బి, 166, 167, 197, 307, 326, 465, 508 (34) సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం జరిగిందని కృష్ణంరాజు ఆరోపణలు చేశారు. ఈ కేసులో జగన్‌ ఏ-3గా ఉన్నాఉ. సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్ ఏ-1, ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు ఏ- 2, విజయపాల్ ఏ- 4, డాక్టర్ ప్రభావతి ఏ-5 గా ఉన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో పలు ఇతర పేర్లు కూడా ఉన్నాయి. ఈ సంఘటన మే 14, 2021న జరిగింది.

ఈ కేసుపై బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు పీవీ సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారనే వార్తలు తనకు షాక్ గురిచేశాయంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. డీజీపీ ర్యాంకులో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులు, మాజీ సీఎం మీద ఎఫ్ఐర్ నమోదైందన్న వార్తలు తనను షాక్‌కు గురిచేశాయన్నారు. దురదృష్టవశాత్తూ నిజాయితీగల పోలీసులు ఈ దేశంలో ప్రతీకార రాజకీయాల్లో బాధితులుగా మారుతున్నారని ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం మారడం తప్ప మూడేళ్లలో ఏం మారిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.

Next Story