ఇవాళ హైదరాబాద్‌కు రానున్న కల్వకుంట్ల కవిత

లిక్కర్‌ స్కామ్‌ కేసుకు సంబంధించి ఢిల్లీలోని తీహార్ జైలులో ఐదు నెలలు ఉన్న బీఆర్‌ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత నిన్న విడుదల అయ్యారు

By అంజి  Published on  28 Aug 2024 1:14 PM IST
BRS leader, Kalvakuntla Kavitha, Hyderabad , Telangana

ఇవాళ హైదరాబాద్‌కు రానున్న కల్వకుంట్ల కవిత

న్యూఢిల్లీ: లిక్కర్‌ స్కామ్‌ కేసుకు సంబంధించి ఢిల్లీలోని తీహార్ జైలులో ఐదు నెలలు ఉన్న బీఆర్‌ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత నిన్న విడుదల అయ్యారు. ఇవాళ కవిత హైదరాబాద్‌కు రానున్నారు. బుధవారం సాయంత్రం 5.45 గంటలకు ఆమె హైదరాబాద్‌ విమానాశ్రయంలో దిగనున్నారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మంగళవారం సాయంత్రం ఆమె తీహార్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె అరెస్టయ్యారు. ఆమె తన కుమారుడు, భర్త అనిల్, ఆమె సోదరుడు కేటీఆర్‌తో కలిసి హైదరాబాద్‌కు తిరిగి వెళ్లనున్నారు.

''కవిత సాయంత్రం 5.45 గంటలకు ఇక్కడ ల్యాండ్ అవుతుందని భావిస్తున్నారు. అయితే ఈరోజు ఆమె తన తండ్రిని కలుస్తుందా లేదా అనేది క్లారిటీ లేదు''. విమానాశ్రయంలో ఆమెకు బీఆర్‌ఎస్‌ క్యాడర్‌ స్వాగతం పలుకుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆమె జైలు నుంచి విడుదలైన వెంటనే, బీఆర్‌ఎస్‌ పార్ట్ కార్యకర్తలు ఆమెకు డప్పులు, బాణసంచాతో ఘన స్వాగతం పలికారు. ఆమె నేరుగా న్యూఢిల్లీలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్లి పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటుపై బుధవారం రోస్ అవెన్యూ కోర్టులో విచారణకు కవిత వర్చువల్‌గా హాజరయ్యారు. మార్చి 15న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ నివాసం నుంచి కవితను అరెస్ట్ చేసిన ఈడీ.. ఏప్రిల్ 11న తీహార్ జైలు నుంచి సీబీఐ అరెస్ట్ చేసింది. కవిత సుమారు ఐదు నెలల పాటు కస్టడీలో ఉన్నారని, ఈ కేసుల్లో ఆమెపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దర్యాప్తు పూర్తయిందని జస్టిస్ బిఆర్ గవాయ్, కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

Next Story