సవాల్ చేసిన కల్వకుంట్ల కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు

By Medi Samrat  Published on  6 April 2024 5:42 PM IST
సవాల్ చేసిన కల్వకుంట్ల కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కవితను విచారించేందుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐకి అనుమతి మంజూరు చేసింది. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తనను విచారించేందుకు సీబీఐకి అనుమతి ఇవ్వడాన్ని కవిత సవాల్ చేస్తూ, రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కవిత తరపున న్యాయవాది నితీశ్ రాణా వాదనలు వినిపించారు. కవిత పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం కావాలని సీబీఐ కోరగా, ఏప్రిల్ 10 వరకు సమయం ఇస్తామని న్యాయమూర్తి తెలిపారు. సీబీఐ కౌంటర్ అఫిడవిట్ సమర్పించాక, ఏప్రిల్ 10వ తేదీన తదుపరి విచారణ చేపడతామని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది.

శుక్రవారం నాడు బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితను విచారించేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు అనుమతిని మంజూరు చేసింది. జైలు ఆవరణలోనే కవితను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు ఆమోదించింది. విచారణకు ఒకరోజు ముందుగా జైలు అధికారులకు తెలియజేయాలని, విచారణ సమయంలో మహిళా కానిస్టేబుళ్లు తప్పనిసరిగా హాజరుకావాలని కోర్టు షరతు విధించింది.

Next Story