'దేశ్ కే లియే ఆ రహ హై కేసీఆర్' సాంగ్ ఆవిష్కరణ

BRS leader K Kesha Rao launched the BRS Hindi song. 'దేశ్ కేలియే ఆ రహ హై కెసిఆర్ (దేశం కోసం వస్తున్నాడు కెసిఆర్)' సాంగ్‌ను ఆ పార్టీ నాయకుడు

By అంజి
Published on : 14 Dec 2022 12:08 PM IST

దేశ్ కే లియే ఆ రహ హై కేసీఆర్ సాంగ్ ఆవిష్కరణ

'దేశ్ కేలియే ఆ రహ హై కెసిఆర్ (దేశం కోసం వస్తున్నాడు కెసిఆర్)' సాంగ్‌ను ఆ పార్టీ నాయకుడు అలిశెట్టి అరవింద్ అద్భుతంగా రూపకల్పన చేయించారు. తాజాగా ఈ పాటను రాజ్యసభ సభ్యులు కే కేశవరావు ఢిల్లీలోని బీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీస్‌లో ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్‌ఎస్‌గా జాతీయ ఎన్నికల కమిషన్ గుర్తింపు ఇవ్వడంతో అరవింద్ ఈ సాంగ్‌ను హిందీలో ప్రత్యేకంగా రూపకల్పన చేయించారు. నిమిషంనర నిడివిలో రూపొందించిన ఈ పాటలో కెసిఆర్ దేశానికి ఎంత అవసరమో తెలియజేస్తూ సాగుతుంది.

''అలుపెరుగని పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధిలో కూడా మొదటి స్థానంలో నిలిపిన మహా నాయకుడు కేసీఆర్ అని అదే లక్ష్యంతో దేశాన్ని కూడా ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కలలు కంటున్న దేశ నాయకుడికి తన చిరుకానుక'' అని అరవింద్ అన్నారు. అసమాన ప్రతిభతో దేశాన్ని సైతం ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకువెళ్ల సత్తా కలిగిన మహా నేత వెంటే దేశమంతా సాగుతుందని అలిశెట్టి అరవింద్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story