బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. తీహార్ జైల్లో ఉన్న ఆమె అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను జైలు నుంచి దీన్ దయాళ్ ఆసుపత్రికి వైద్య చికిత్స నిమిత్తం తరలించారు. కవిత ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. వైద్యుల సూచన మేరకు అధికారులు ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ అయ్యాక ఆమెను నేరుగా తీహార్ జైలుకు తీసుకువెళ్లారు.
మనీలాండరింగ్ ఆరోపణలపై కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఏప్రిల్ 11న సీబీఐ అధికారులు ఆమెను జైల్లోనే అదుపులోకి తీసుకున్నారు. కవిత నాలుగు నెలలుగా జైల్లో ఉన్నారు. కవిత తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నట్టు సమాచారం. కవిత ఆరోగ్యంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. మరో వైపు ఆమెకు బెయిల్ తెప్పించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.