Video: ఎమ్మెల్సీ కవిత ఆరోపణలపై హరీష్‌ రావు సంచలన కామెంట్స్‌

యూకే పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ చేరుకున్న బీఆర్‌ఎస్‌ నాయకుడు హరీష్‌ రావు.. ఇటీవల ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలపై స్పందించారు.

By అంజి
Published on : 6 Sept 2025 7:56 AM IST

BRS, Harish Rao, MLC Kavitha, Telangana

ఎమ్మెల్సీ కవిత ఆరోపణలపై హరీష్‌ రావు సంచలన కామెంట్స్‌

యూకే పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ చేరుకున్న బీఆర్‌ఎస్‌ నాయకుడు హరీష్‌ రావు.. ఇటీవల ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలపై స్పందించారు. 25 ఏళ్ల తన రాజకీయ జీవితం రాష్ట్ర ప్రజల ముందు తెరిచిన పుస్తకం అని అన్నారు. రాష్ట్ర సాధనలో తన నిబద్ధత అందరికీ తెలుసునన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో రెండు దశాబ్దాలుగా రాష్ట్ర సాధన, అభివృద్ధిలో తన పాత్ర అందరికీ స్పష్టమని పేర్కొన్నారు.

ఇటీవల కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, అలా ఎందుకు చేశారో, ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు చేశారో? వారికే తెలియాలన్నారు. తనపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో స్పష్టం చేశారు. రైతులు ఎరువుల కొరత, ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతుండగా రేవంత్‌ ప్రభుత్వం వ్యవస్థలను కూల్చుతోందని విమర్శించారు.

అంతకుముందు కాళేశ్వరం నుంచి వచ్చిన అవినీతి డబ్బుతో హరీష్‌ రావు కుట్రలు చేశారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. 2018లో 20 - 25 మంది ఎమ్మెల్యేలకు హరీష్‌ రావు ఫండింగ్‌ చేశారని, అవి కాళేశ్వరం నుంచి వచ్చిన డబ్బులేనని అన్నారు. కొద్దిగా అటు ఇటు అయితే ఆయన దగ్గర ఎమ్మెల్యేలు ఉండాలనే ఆ కుట్ర చేశారని ఆరోపించారు. ఆయనకు ఆ ఆలోచన ఎలా వచ్చింది? అని ప్రశ్నించారు. 2009లో కేటీఆర్‌ను ఓడించేందుకు హరీష్‌ రావు సిరిసిల్లకు రూ.60 లక్షలు పంపారని, కేసీఆర్‌, కేటీఆర్‌, నన్ను ఓడించేందుకు ఆయన కుట్ర చేశారని కవిత ఆరోపించారు.

Next Story