'కాంగ్రెస్‌కు ఓటేయాలన్న బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌ రావు'.. వీడియో వైరల్‌

పొరపాటున కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించండి అంటూ హరీష్ రావు మాట్లాడిన వీడియో ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

By అంజి  Published on  10 May 2024 4:26 PM IST
BRS, Harish Rao, vote, Congress , Husnabad

'కాంగ్రెస్‌కు ఓటేయాలన్న బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌ రావు'.. వీడియో వైరల్‌

ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హరీష్ రావు నోరు జారింది. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించండి అంటూ హరీష్ రావు మాట్లాడిన వీడియో ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ కార్నర్‌ మీటింగ్‌లో కరీంనగర్ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వినోద్ తరఫున మాజీ మంత్రి హరీష్ రావు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. అక్కా చెల్లెళ్లు, అన్నాదమ్ముళ్లు, రైతన్నలు, ఎస్టీ అక్కలు, చెల్లెళ్లు అందరూ కాంగ్రెస్‌కు ఓటేయాలని కోరుతున్నాను అని అన్నారు.

అది విన్న జనం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే ఆ పక్కనే ఉన్న వినోద్ వెంటనే తప్పును గ్రహించి హరీశ్‌ను అప్రమత్తం చేశారు. అనంతరం హరీష్ రావు తన తప్పును సరి చేసుకుని తిరిగి మాట్లాడారు. బీఆర్ఎస్ అనబోయి పొరపాటున కాంగ్రెస్‌కు ఓటు వేయాలనడంతో ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మాజీ మంత్రి హరీష్ రావు నోట కాంగ్రెస్‌కు ఓటెయ్యాలి అంటూ వచ్చిన మాటలకు నెటిజన్లలో చర్చలు, ప్రశ్నలు మొదలయ్యాయి.

Next Story