అభిమాని ఇచ్చిన ఆతిథ్యం, ఆహారం ఎంతో నచ్చాయి: కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం ఓ అభిమాని ఇంటికి వెళ్లి ఆశ్చర్యపరిచారు.
By Srikanth Gundamalla Published on 8 Jan 2024 10:33 AM ISTఅభిమాని ఇచ్చిన ఆతిథ్యం, ఆహారం ఎంతో నచ్చాయి: కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం ఓ అభిమాని ఇంటికి వెళ్లి ఆశ్చర్యపరిచారు. అభిమాని ఆహ్వానం మేరకు అతడి ఇంటికి వెళ్లి సందడి చేశారు కేటీఆర్. ఆథిత్యాన్ని స్వీకరించి అభిమాని కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఆసక్తికరమైన ఈ సన్నివేశం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. బోరబండలోని బంజారాగర్‌కు చెందిన ఇబ్రహీంఖాన్ ఇంటికి మాజీ మంత్రి కేటీఆర్ వెళ్లారు.
న్యూఇయర్ సందర్భంగా జనవరి 2న ఎక్స్ వేదికగా కేటీఆర్‌కు ఇబ్రహీంఖాన్ అనే వ్యక్తి శుభాకాంక్షలు చెప్పాడు. ఆ తర్వాత తన ఇంటికి విచ్చేసి ఆతిథ్యం స్వీకరించాలని కోరాడు. అభిమాని కోరిక మేరకే కేటీఆర్ ఆదివారం ఇబ్రహీంఖాన్ ఇంటికి వెళ్లాడు. అభిమానిని ఆశ్చర్యపరిచాడు. ఇబ్రహీంఖాన్ ఇంటికి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో కలిసి వెళ్లారు కేటీఆర్. అక్కడ ఇబ్రహీంఖాన్ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అభిమాని ఇంటికి వెళ్లడంపై మాజీమంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందించిన సేవలను గుర్తిస్తూ ఓ సాధారణ వ్యక్తి తన ఇంటికి ఆహ్వానించడం చాలా ఆనందం కలిగించిందని మాజీమంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాలు ప్రజాజీవితంలో మరింత నిబద్ధతతో పనిచేసేలా ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఇబ్రహీంఖాన్‌కు తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. బోరబండలోని ఆయన ఇంటికి వెళ్లాననీ.. ఆప్యాయతతో రుచికరమైన బిర్యానీ, షీర్ ఖుర్మా అందించాడని తెలిపారు కేటీఆర్. ఆహారం, ఆతిథ్యం చాలా బాగున్నాయని చెప్పారు. వినికిడి సమస్యలతో బాధపడుతున్న ఇబ్రహీంఖాన్ సోదరుడి పిల్లలకు సహాయం చేస్తానని మాట ఇచ్చినట్లు మాజీమంత్రి కేటీఆర్ ఎక్స్‌లో పేర్కొన్నారు.
కాగా. కేటీఆర్‌కు ఆతిథ్యం ఇవ్వడంపై అభిమాని ఇబ్రహీంఖాన్ స్పందించారు. దివ్యాంగులైన తమ పిల్లలకు ఆసరా పెన్షన్ ఇప్పించాలని గతంలో ఎక్స్ వేదికగా కేటీఆర్‌ను కోరామని చెప్పారు. దాంతో.. ఆయన కార్యాలయం వెంటనే స్పందించిందని చెప్పాడు. పిల్లల చికిత్స కు అవసరమైన సాయం చేసేందుకు కేటీఆర్ భరోసా ఇచ్చారని గుర్తు చేసుకున్నాడు ఇబ్రహీంఖాన్.
బోరబండ ఇబ్రహీం ఖాన్ ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి @KTRBRS.
— BRS Party (@BRSparty) January 7, 2024
నూతన సంవత్సరం సందర్భంగా కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలిపి తన ఇంటికి రావాలని కోరిన ఇబ్రహీం ఖాన్ కుటుంబం
కేటీఆర్ కు ఆతిథ్యం ఇచ్చిన ఇబ్రహీం ఖాన్ కుటుంబం
ఇబ్రహీం ఖాన్ పిల్లలకు ఉన్న మూగ చెవుడు కోసం అవసరమైన… pic.twitter.com/OegPzkAs7X