కాంగ్రెస్ పాలనలో ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్నో!: కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 22 May 2024 10:25 AM ISTకాంగ్రెస్ పాలనలో ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్నో!: కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో విత్తనాల కోసం రైతులు క్యూలైన్‌లో నిలబడలేక అవస్థలు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్యూలైన్ కోసం రైతులు పేపర్లు.. పాస్ పుస్తకాల కవర్లను క్యూలైన్‌గా పేర్చిన ఫొటోలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రైతులు ఎక్కువ సేపు నిలబడలేక తమ వెంట తెచ్చుకున్న పాస్‌బుక్ కవర్లను క్యూలైన్‌లో పెట్టారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు కాంగ్రెస్ పాలనలో ఆరు నెలల్లోనే ఆవిష్కృతం అయ్యాయని కేటీఆర్ అన్నారు. పదేళ్లపాటుగా కనిపించని కరెంటు కోతలను ఇప్పుడు మరోసారి చూస్తున్నామని అన్నారు. విద్యుత్ సబ్ స్టేషన్లను ప్రజలు ముట్టడించడం చూస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ముఖ్యంగా అన్నదాతలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ చెప్పారు. కాలిన మోటార్లు, పేలిన ట్రాన్స్‌ఫార్మర్లను చూస్తున్నామన్నారు. ఇన్నాళ్లకు ఇన్వర్టర్లు-జనరేటర్ల మోతలు చూస్తున్నామని ఎక్స్‌లో కేటీఆర్ పోస్టు పెట్టారు. సాగునీరు అందక రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారని చెప్పార. ట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు దర్శనం ఇస్తున్నాయని అన్నారు. చుక్కనీరు లేక బోసిపోయిన చెరువులను చూస్తున్నామని కేటీఆర్ అన్నారు.
మరోవైపు నష్టాలపాలైన రైతులు అప్పులు కట్టలేక అవస్తలు పడుతున్నారని కేటీఆర్ చెప్పారు. రైతురుణమాఫీ అని చెప్పి ఇంకా తాత్సారం చేస్తున్న ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. రైతుబంధు కోసం రైతులు నెలలపాటుగా పడిగాపులు కాస్తున్నామన్నారు. మరోవైపు పాత అప్పు కోసం రైతులకు నోటీసులు ఇవ్వడాన్ని కూడా చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కు లేకపోవడం చూస్తున్నామన్నారు. పదేళ్ల తర్వాత రైతులు రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కాంగ్రెస్ సర్కార్‌పై మండిపడ్డారు. జోగిపేటలో విత్తనాల కోసం ఇవాళ రైతులు క్యూ కట్టారనీ.. తర్వాత మరెక్కడ జరుగుతుందో అని కేటీఆర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు..!
— KTR (@KTRBRS) May 22, 2024
6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతం..!!
పదేళ్లు కనిపించని కరెంట్ కోతలను చూస్తున్నం
విద్యుత్తు సబ్ స్టేషన్ల ముట్టడిలను చూస్తున్నం
కాలిన మోటర్లు, పేలిన ట్రాన్స్ఫార్మర్లు చూస్తున్నం
ఇన్నాళ్లకు ఇన్వర్టర్లు-జనరేటర్ల మోతలు చూస్తున్నం
సాగునీరు లేక ఎండిన… pic.twitter.com/cqNnFuzvk4