మెడికల్‌ కాలేజ్‌లు కాదు..32 యూట్యూబ్‌ చానెళ్లు పెట్టాల్సింది: కేటీఆర్

తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్టు పెట్టారు.

By Srikanth Gundamalla  Published on  31 Dec 2023 8:54 AM GMT
brs, ktr, tweet,  telangana, election resutls,

మెడికల్‌ కాలేజ్‌లు కాదు..32 యూట్యూబ్‌ చానెళ్లు పెట్టాల్సింది: కేటీఆర్ 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు హామీల అమలుపై దృష్టి సారించింది. ఆరు గ్యారెంటీల అమలుపై ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. బీఆర్ఎస్‌కు ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. గెలుపు మరోసారి తమనే వరిస్తుందనీ దీమా వ్యక్తం చేశారు. కానీ ప్రజలు అనుకున్నట్లుగా తీర్పును ఇవ్వలేదు. అయితే.. ప్రజా తీర్పును గౌరవిస్తామని ఆ పార్టీ నాయకులంతా చెప్పారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను సమీక్షించుకుంటామని కూడా చెప్పారు.

తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పలువురు పలు విధాలుగా స్పందనలు, పరిశీలనలు చేస్తున్నారనీ చెప్పారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన.. కేసీఆర్ 32 మెడికల్ కాలేజ్‌లకు బదులు.. 32 యూట్యూబ్‌ ఛానెళ్లు పెట్టుకుని ఉంటే తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవడం సులభమయ్యేదని చెప్పుకొచ్చారు. ఈ విషయం ఓ నెటిజన్ రాసుకొచ్చారని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ వాదనను కొంత వరకు తాను కూడా అంగీకరిస్తున్నట్లు కేటీఆర్ అన్నారు.

ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోస్టు వైరల్ అవుతోంది. కొందరు కేటీఆర్‌కు పాజిటివ్‌గా రియాక్షన్లు ఇస్తున్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ ఈ దిశగా ఆలోచించాలని పలువురు కామెంట్స్ చేశారు. అయితే.. మరికొందరు మాత్రం ఎన్నికల వేళ అన్ని పార్టీలు చానెళ్లను వాడకున్నాయనీ.. కానీ అవి ఎంత మేర ప్రభావం చేశాయో చెప్పలేమంటున్నారు. అంతేకాదు.. కేసీఆర్ ప్రభుత్వం కూలుతుందని ఎక్కువ శాతం ప్రజలు అనుకోలేదని.. తమ ప్రాంత ఎమ్మెల్యే మారాలని మాత్రమే ఏకాభిప్రాయంతో ఓటు వేశారని కామెంట్స్ చేశారు. పార్టీలో ప్రక్షాళన ముఖ్యమని పలువురు నెటిజన్లు సూచనలు చేస్తున్నారు. ఏది ఏమైనా కేటీఆర్ ట్వీట్‌ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసిందనే చెప్పాలి.

Next Story