తెలంగాణకు వస్తోన్న ప్రధాని మోదీకి కేటీఆర్ ప్రశ్నలు
ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణకు వస్తున్నారు
By Srikanth Gundamalla Published on 7 May 2024 9:03 AM GMTతెలంగాణకు వస్తోన్న ప్రధాని మోదీకి కేటీఆర్ ప్రశ్నలు
ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం కోసం తెలంగాణకు వస్తున్నారు. ఈక్రమంలోనే రాష్ట్రానికి వస్తోన్న ప్రధాని మోదీకి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. మోదీ తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తన ఖాతాలో ప్రశ్నలను ట్వీట్ చేశారు కేటీఆర్.
తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్న నేపథ్యంలో యావత్ తెలంగాణ సమాజం పక్షాన కొన్ని ప్రశ్నలు అడుగుతున్నట్లు కేటీఆర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకండి అంటూ కోరారు. పదేళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్నారనీ.. దశాబ్దా కాలంలో రాష్ట్రానికి మీరేం చేశారో చెప్పి ఓట్లు అడగాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు అమలు చేయాల్సిన ప్రధాన హామీలను ఎందుకు మరిచారని ప్రశ్నించారు. తెలంగాణలోని ఒక్కసాగు నీటి ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఇక తెలంగాణలోని యువతకు ఉపాధినిచ్చే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ఎందుకు పాతరేశారో చెప్పాలని ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
ఏజెన్సీ బిడ్డలకు బతుకుదెరువు ఇచ్చే బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని కూడా ఎందుకు బొంద పెట్టారని ప్రశ్నించారు కేటీఆర్. ఐటీఐఆర్, హైదారాబాద్ ప్రాజెక్టును ఎందుకు ఆగం చేశారని అన్నార. పిల్లలకు బంగారు భవిష్యత్ ఇస్తారనుకుంటే లక్షలాది మంది తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు చల్లారని అన్నారు. మండిపోతున్న నిత్యావసర ధరలను ఎందుకు అదుపు చేయడంలేదని ప్రశ్నించారు. అవినీతి పరులకు బీజేపీలో స్థానం ఇచ్చి.. రాజకీయ ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థలను ఎందుకు ప్రయోగిస్తున్నారంటూ ప్రధాని మోదీని ప్రశ్నించారు. చేనేత రంగంపై జీఎస్టీ వేసి మగ్గారినికి ఎందుకు మరణశాసనం రాశారంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రధానిగా మోదీ ప్రజల సమస్యలు పరిష్కరించాలి కానీ.. వారి దృష్టిని మరల్చకూడదని అన్నారు. రెచ్చగొట్టే రాజకీయాలు తెలంగాణలో సాగవు అనీ.. అలా చేస్తే రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లు కూడా వేయరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
పిరమైన ప్రధాని @narendramodi గారు..
— KTR (@KTRBRS) May 7, 2024
మీరు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో..
యావత్ తెలంగాణ సమాజం పక్షాన కొన్ని ప్రశ్నలు..
-----------------------------------
దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకండి..!
దశాబ్దకాలంలో ఏం చేశారో విషయం చెప్పి ఓట్లడగండి..!!
ప్రధానిగా పదేళ్లు…