తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి: కేటీఆర్
తెలంగాణలో విష జ్వరాలు ప్రబలుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 27 Aug 2024 5:55 AM GMTతెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి: కేటీఆర్
తెలంగాణలో విష జ్వరాలు ప్రబలుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. లక్షల మంది ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ జ్వరాల బారిన పడి బాధపడుతున్నారని అన్నారు. వైద్యారోగ్యశాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో డెంగ్యూ కేసులు మరింత ఎక్కువ అవుతున్నా.. ఎందుకు పట్టించుకోవడం లేదంటూ నిలదీశారు. గత ఏడాది కంటే ఈసారి అధికంగా కేసులు నమోదు అవుతున్నాయని చెప్పారు. కానీ.. ప్రభుత్వం మాత్రం తక్కువ కేసులు ఉన్నట్లు చెబుతోందని కేటీఆర్ చెప్పారు.
మెజారిటీ జిల్లాల్లో డెంగ్యూ కేసులు విపరీతంగా నమోదు అవుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి 36 శాతం అదికంగా కేసులు నమోదు అవ్వడం ఆందోళనకు గురిచేస్తోందన్నారు. సీజనల్ వ్యాధులపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విడుదల చ చేసిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో 2,56,324 మందికి జ్వరాలు ఉన్నట్లు గుర్తించారని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రులు సహా అన్ని ప్రయివేటు ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్‌కు బెడ్లు దొరకని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని కేటీఆర్ అన్నారు. ఒక్కో బెడ్‌పై ఇద్దరు, ముగ్గురికి చికిత్స అందిస్తున్నారని కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అయితే సరిపడా మందులు కూడా అందుబాటులో లేవన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు నిజాలు దాస్తుందో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రజలను అలర్ట్ చేసి.. హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించే పరిస్థితి తలెత్తిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.