హైదరాబాద్‌ లోక్‌సభ అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్‌..ఫుల్‌ లిస్ట్‌ ఇదే..

పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి కూడా తాజాగా బీఆర్ఎస్‌ అభ్యర్థిని ప్రకటించింది.

By Srikanth Gundamalla  Published on  25 March 2024 6:57 AM GMT
brs, hyderabad, lok sabha candidate, telangana,

హైదరాబాద్‌ లోక్‌సభ అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్‌..ఫుల్‌ లిస్ట్‌ ఇదే..

లోక్‌సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్‌ అభ్యర్థుల లిస్ట్‌ను ఇప్పటికే ప్రకటించింది. ఇక చివరగా పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి కూడా తాజాగా బీఆర్ఎస్‌ అభ్యర్థిని ప్రకటించింది. గడ్డం శ్రీనివాస్ యాదవ్‌ను హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దించుతున్నట్లు బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ అధికారిక ఎక్స్‌ ఖాతాలో కూడా ఈ విషయాన్ని షేర్ చేశారు.

ఇప్పికే పలు విడతల్లో లోక్‌సభ అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది. హైదరాబాద్‌ స్థానాన్ని మాత్రం చివరకు వరకు పెండింగ్‌లో ఉంచింది. ఆ స్థానంలో శ్రీనివాస్‌ యాదవ్‌ను ఖరారు చేయడంతో రాష్ట్రంలో అన్ని లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులన ప్రకటించినట్లు అయ్యింది బీఆర్ఎస్.

తెలంగాణలో లోక్‌సభ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే..

నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ అభ్యర్థిగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

మెదక్‌ లోక్‌సభ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి

మహబూబ్‌నగర్‌ లోక్‌సభ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్‌రెడ్డి

ఆదిలాబాద్‌ లోక్‌సభ అభ్యర్థిగా ఆత్రం సక్కు

భువనగిరి లోక్‌సభ అభ్యర్థిగా క్యామ మల్లేశ్‌

నల్గొండ లోక్‌సభ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి

సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా పద్మారావుగౌడ్

కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థిగా వినోద్‌ కుమార్‌

పెద్దపల్లి లోక్‌సభ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్‌

ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు

మహబూబాబాద్‌లోక్‌సభ అభ్యర్థిగా మాలోత్‌ కవిత

చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్

వరంగల్‌ లోక్‌సభ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య

జహీరాబాద్‌ లోక్‌సభ అభ్యర్థిగా అనిల్‌కుమార్‌

నిజామాబాద్‌ లోక్‌సభ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్‌

మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి

హైదరాబాద్‌ లోక్‌సభ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌

Next Story