కాంగ్రెస్ డిక్లరేషన్‌పై బీఆర్ఎస్ నేతల కౌంటర్ ఎటాక్
తెలంగాణలో ఎన్నికల దగ్గర పడుతున్నాయి. దాంతో రాజకీయాల్లో వేడిపెరుగుతోంది.
By Srikanth Gundamalla Published on 27 Aug 2023 5:15 PM ISTకాంగ్రెస్ డిక్లరేషన్‌పై బీఆర్ఎస్ నేతల కౌంటర్ ఎటాక్
తెలంగాణలో ఎన్నికల దగ్గర పడుతున్నాయి. దాంతో రాజకీయాల్లో వేడిపెరుగుతోంది. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాష్ట్రంలో పర్యటించారు. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించింది. ప్రస్తుతం దీనిపైనే బీఆర్‌ఎస్ నాయకులు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.
మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు డిక్లరేషన్ల మీద డిక్లరేషన్లు ఇస్తున్నారని విమర్శించారు. కర్ణాటకలో ముందు డిక్లరేషన్ చేసి.. ఆ తర్వాత ఖర్గే తెలంగాణలో డిక్లరేషన్ చేయాలని సూచించారు. అయితే.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు చేసిందేమీ లేదని ఫైర్ అయ్యారు. కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండి అక్కడేం చేసిందని ప్రశ్నించారు. బండి సంజయ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బండి పోతే బండి ఇస్తామని ఇలాగే చెప్పారని, ఇప్పటికీ బండి లేదు, గుండు లేదని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు చెప్పే డిక్లరేషన్ నమ్మశక్యంగా లేదని హరీశ్‌రావు అన్నారు.
ఎన్నికల ముందే ఇలాంటి నేరవేర్చలేని హామీలను ఇస్తారని.. ఆ తర్వాత వాటి గురించి కూడా మాట్లాడరని హరీశ్‌రావు విమర్శల చేశారు. అమలుకి వీలుకాని డిక్లరేషన్ ఇకనుంచైనా చేయడం మానుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలే కోరుకుంటున్నారని గుర్తు చేశారు. కాబట్టి ప్రజలు దీన్ని గమనించి.. మరోసారి బీఆర్ఎస్‌ను గెలిపించాలని మంత్రి హరీశ్‌రావు కోరారు.
తెలంగాణలో కాంగ్రెస్ తప్పుడు డిక్లరేషన్ ప్రకటించిందని మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు దమ్ముంటే దేశ వ్యాప్తంగా ప్రకటించగలదా అని ప్రశ్నించారు. మల్లికార్జున ఖర్గే తన ప్రశ్నకు సమాధానం చెప్పాలన్నారు సత్యవతి రాథోడ్. కర్ణాటకలో అమలు చేస్తున్న పథకాలు ఉంటే తెలంగాణలో చెప్పకోవాలని సూచించారు. అంతేకానీ.. ఇలా అబద్ధపు హామీలు ఇవ్వడం మానుకోవాలని హితవు పలికారు.