బడ్జెట్‌లో కొత్తేమీ లేదని.. ఏ సంక్షేమ పథకం ఇందులో లేదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ... ఒత్తి ఒత్తి పలకడం తప్ప బడ్జెట్ లో ఏమి కనిపించలేదని ఎద్దేవా చేశారు. ఆరు మాసాలు సమయం ఇవ్వాలని తాను ఇన్నాళ్లు అసెంబ్లీకి రాలేదన్నారు. బడ్జెట్ లో పాలసీ, ఫార్ములా లేదని అన్నారు. మా హయాంలో రెండు పంటలకు రైతు బంధు ఇచ్చామని తెలిపారు. రైతు బంధు ఎగొట్టే ప్రయత్నం చేస్తున్నారని.. కాంగ్రెస్ రైతు శత్రువు ప్రభుత్వంగా మారిందన్నారు.
ఆర్ధికమంత్రి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అంత గ్యాస్ తప్ప ఏమి.లేదన్నారు. ఐటీ పాలసీ ఏమి లేదన్నారు. ట్రాష్ ప్రసంగం లాగానే ఉందన్నారు. పేద ప్రజల పాలసీ లేదన్నారు. వ్యవసాయ స్థిరీకరణ లేదన్నారు. స్టోరీ టెల్లింగ్ లాగానే బడ్జెట్ ప్రసంగం మారిందన్నారు. బడ్జెట్ లో ఏ ఒక్క పాలసీ కూడా నిర్దిష్టంగా, పద్దతిగా లేదన్నారు. ఈ బడ్జెట్‌పై ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామన్నారు.