నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్‌ ఎంపీ అభ్య‌ర్ధిగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌.. ప్ర‌క‌టించిన అధిష్టానం

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖరరావు శుక్రవారం ప్రకటించారు.

By Medi Samrat  Published on  22 March 2024 2:30 PM IST
నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్‌ ఎంపీ అభ్య‌ర్ధిగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌.. ప్ర‌క‌టించిన అధిష్టానం

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖరరావు శుక్రవారం ప్రకటించారు. ఇటీవలే బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి టికెట్‌ లభించింది. అదే విధంగా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్ అధికారి పీ వెంకటరాంరెడ్డి బరిలోకి దిగనున్నారు. మరో రెండు రోజుల్లో హైదరాబాద్, సికింద్రాబాద్, నల్గొండ, భువ‌న‌గిరి.. నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

బీఆర్ఎస్ ఇప్ప‌టివ‌ర‌కూ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్-మ‌న్నె శ్రీనివాస్ రెడ్డి, క‌రీంన‌గ‌ర్-వినోద్ కుమార్, పెద్ద‌ప‌ల్లి-కొప్పుల ఈశ్వ‌ర్, జ‌హీరాబాద్-గాలి అనిల్ కుమార్, ఖ‌మ్మం-నామా నాగేశ్వ‌ర్ రావు, మ‌హ‌బూబాబాద్-మాలోత్ క‌విత‌, మ‌ల్కాజ్‌గిరి-రాగిడి ల‌క్ష్మారెడ్డి, ఆదిలాబాద్-ఆత్రం స‌క్కు, నిజామాబాద్-బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్, వ‌రంగ‌ల్ -క‌డియం కావ్య ల‌ను అభ్య‌ర్ధులుగా ప్ర‌క‌టించింది.

Next Story