ములుగు జిల్లా మల్లంపల్లి వద్ద 163 ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జి కూలడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వరంగల్ వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. కూలిన వంతెన పక్కనే.. కొత్త వంతెన పనులు చేపట్టిన కారణంగానే బ్రిడ్జి కూలిపోచిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పాత వంతెనకు సపోర్టుగా ఉన్న మట్టిని జేసీబీతో ఇష్టారాజ్యంగా తొడడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని, వంతెన ప్రమాదస్థాయిలో ఉందని ఎన్ని సార్లు చెప్పినా ఇంజనీర్లు ఎవరూ పట్టించుకోలేదని స్థానిక ప్రజలు తెలిపారు.