బ్రహ్మానందం ఇంట బ్యాండ్ బాజా బారాత్

Brahmanandam meets CM KCR and invites for his son wedding. కామెడీ కింగ్ బ్రహ్మానందం ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన చిన్న కొడుకు సిద్ధార్థ్ కు పెళ్లి ఫిక్స్ అయ్యింది.

By Medi Samrat
Published on : 29 July 2023 8:45 PM IST

బ్రహ్మానందం ఇంట బ్యాండ్ బాజా బారాత్

కామెడీ కింగ్ బ్రహ్మానందం ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన చిన్న కొడుకు సిద్ధార్థ్ కు పెళ్లి ఫిక్స్ అయ్యింది. డాక్టర్ ఐశ్వర్యను పెళ్లి చేసుకోబోతున్నాడు. వీరి ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది. ఈ పెళ్ళికి పలువురిని బ్రహ్మానందం ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆయన కుటుంబ సమేతంగా ప్రగతి భవన్ న్ లో సీఎం కేసీఆర్ ను కలిసి పెళ్లి కార్డ్ ఇచ్చారు. హైదరాబాద్ లో జరగనున్న తన కొడుకు పెళ్లికి రావాల్సిందిగా కేసీఆర్ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం దంపతులకు కేసీఆర్ విషెస్ తెలిపారు. తాను వేసిన తిరుమల శ్రీవారి చిత్రపటాన్ని బ్రహ్మానందం కేసీఆర్ కు కానుకగా అందజేశారు. కేసీఆర్ దంపతులు కాసేపు వారితో ముచ్చటించారు. బ్రహ్మానందానికి ఇద్దరు కుమారులు. ఒకరు గౌతమ్.. తెలుగు మూవీ లవర్స్ కు పరిచయమే.. ఇంకొకరు సిద్ధార్థ్.

సిద్ధార్థ్ నిశ్చితార్థం మే 21న ఐశ్వర్య అనే అమ్మాయితో జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు హజరయ్యి కొత్త జంటను ఆశీర్వదించారు. పెళ్లి ఇంకా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఇక బ్రహ్మానందం చాలా తక్కువగా సినిమాలు చేస్తున్నారు. ఆయన బ్రో అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించారు. బ్రో ప్రీరిలీజ్ ఈవెంట్ లో కూడా బ్రహ్మానందం సందడి చేశారు.


Next Story