బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గురువారం సాయంత్రం ముంబైలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కలిశారు. కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవరాలి పెళ్లి సందర్భంగా నిన్న ముంబై వెళ్లిన రేవంత్ రెడ్డితో సల్మాన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీ గురించి వీరిద్దరూ మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. 
ఈ సమావేశంలో, సల్మాన్ ఖాన్ రాష్ట్ర వృద్ధి దార్శనికతకు ప్రశంసలు వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ యొక్క శక్తివంతమైన ఇమేజ్‌ను ప్రచారం చేయడంలో తన మద్దతును అందిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'తెలంగాణ రైజింగ్' నినాదానికి వరల్డ్ వైడ్‌గా ప్రచారం కలపిస్తానని సల్మాన్ చెప్పినట్టు సమాచారం.