శ్రీశైలంలో బోటింగ్‌ తాత్కాలికంగా నిలిపివేత.. ఆ తర్వాతే మళ్లీ ప్రారంభం.!

Boating in Srisailam has been suspended. నాగార్జునసాగర్‌, సోమశిల నుండి శ్రీశైలం వరకు నడుస్తున్న బోట్‌ సర్వీసులకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. క్రూయిజ్‌ బోట్‌ సర్వీసులను

By అంజి  Published on  14 Nov 2021 9:25 AM IST
శ్రీశైలంలో బోటింగ్‌ తాత్కాలికంగా నిలిపివేత.. ఆ తర్వాతే మళ్లీ ప్రారంభం.!

నాగార్జునసాగర్‌, సోమశిల నుండి శ్రీశైలం వరకు నడుస్తున్న బోట్‌ సర్వీసులకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. క్రూయిజ్‌ బోట్‌ సర్వీసులను ప్రస్తుతానికి ఆపివేస్తున్నట్లు తెలంగాణ పర్యాటక శాఖ తెలిపింది. ఈ సంవత్సరం ఆగస్టు 28వ తేదీన ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే బోట్‌లు తిరిగే కొన్ని ప్రాంతాలు తమ పరిధిలో ఉన్నాయంటూ అటవీ శాఖ అధికారుల లేఖ రాశారు. తమ పరిధిలో ఉండడంతో వాటికి టికెట్‌ ధరలో 30 నుంచి 40 శాతం తమకు చెల్లించాలని లేఖలో పేర్కొన్నారు.

నాగార్జునసాగర్‌ నుండి శ్రీశైలం, శ్రీశైలం జలాశయం నుండి నాగార్జునకొండకు వెళ్లే మొత్తం దూరం 14 కిలోమీటర్లు. ఈ మొత్తం దూరం కూడా అటవీశాఖ పరిధిలోనే ఉందని తెలిసింది. ఈ రెండు విహారయాత్రల టికెట్‌ ధరల్లో 30 నుంచి 40 శాతం తమకు చెల్లించాలని అటవీశాఖ అంటోంది. ఒక వేళ ఈ చెల్లింపు జరిగితే సంవత్సరానికి రూ.7 లక్షల నుండి రూ.8 లక్షల వరకు అటవీశాఖకు కట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలంలో బోట్‌ సర్వీసులను తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ నిలిపివేసింది. అటవీశాఖ అధికారులతో చర్చల తర్వాత తిరిగి సర్వీసులు ప్రారంభించనున్నారు.

Next Story