బీఆర్‌ఎస్‌తో బీజేపీ పొత్తు ఉండదు : అమిత్ షా

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపణలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. ఖ‌మ్మం స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ..

By Medi Samrat  Published on  27 Aug 2023 9:00 PM IST
బీఆర్‌ఎస్‌తో బీజేపీ పొత్తు ఉండదు : అమిత్ షా

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపణలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. ఖ‌మ్మం స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌తో తమ పార్టీకి ఎలాంటి అవగాహన లేదని అన్నారు. భవిష్యత్తులో కూడా ఒకటి కావాలని కోరుకోవ‌డం లేద‌న్నారు. ఏఐఎంఐఎంతో చేతులు కలిపినందున బీఆర్‌ఎస్‌తో ఎలాంటి పొత్తు పెట్టుకునే ప్రశ్నే లేదని షా అన్నారు. “మేము ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో వేదిక‌ను పంచుకోలేము. మజ్లిస్‌తో సన్నిహిత సంబంధాలున్న బీఆర్‌ఎస్‌తో కూడా మేం ఎప్పటికీ చేతులు కలపబోం’’ అని అన్నారు.

బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ రహస్య ఒప్పందం కుదుర్చుకుందని అమిత్ షా ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత చేతులు కలపాలని రెండు పార్టీలు సమిష్టిగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక ఎజెండాతో కలిసి కదులుతున్నాయి. బీఆర్ఎస్‌ తో బీజేపీకి అవగాహన ఉందని ఆరోపించారు. బీఆర్ఎస్‌తో చేతులు కలిపే ఉద్దేశం మాకు లేదని నేను స్పష్టం చేస్తున్నానని ఆయన అన్నారు.

Next Story