Telangana: రేపటి నుంచే బీజేపీ విజయ సంకల్ప యాత్ర

హైదరాబాద్: రాష్ట్రంలో ఫిబ్రవరి 20న బీజేపీ విజయ సంకల్ప యాత్రను ప్రారంభించనుంది. ఈ యాత్ర ఫిబ్రవరి 20న నాలుగు ప్రాంతాల నుంచి ఏకకాలంలో ప్రారంభమై మార్చి 1న ముగుస్తుంది.

By అంజి
Published on : 19 Feb 2024 10:25 AM IST

BJP, Vijaya Sankalpa Yatra, Telangana

Telangana: రేపటి నుంచే బీజేపీ విజయ సంకల్ప యాత్ర

హైదరాబాద్: రాష్ట్రంలో ఫిబ్రవరి 20న బీజేపీ విజయ సంకల్ప యాత్రను ప్రారంభించనుంది. ఈ యాత్ర ఫిబ్రవరి 20న నాలుగు ప్రాంతాల నుంచి ఏకకాలంలో ప్రారంభమై మార్చి 1న ముగుస్తుంది. ఫిబ్రవరి 20న ముధోల్‌లో బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత అస్సాం ముఖ్యమంత్రి హిమతా బిస్వా శర్మ యాత్రను జెండా ఊపి ప్రారంభిస్తారు, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తాండూరులో యాత్రను ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. పార్టీ మొత్తం రాష్ట్రాన్ని ఐదు క్లస్టర్లుగా విభజించింది. కొమరం భీమ్ క్లస్టర్ యాత్ర ఆదిలాబాద్ జిల్లాలోని ముధోల్ వద్ద 21 అసెంబ్లీలు, 3 పార్లమెంటులను కవర్ చేస్తుంది. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ వద్ద ముగుస్తుంది.

అదేవిధంగా రాజరాజేశ్వరి క్లస్టర్ యాత్ర తాండూరు నుండి ప్రారంభమవుతుంది. 4 పార్లమెంటులు, 28 అసెంబ్లీలను కవర్ చేస్తుంది. భాగ్యలక్ష్మి క్లస్టర్ భువనగిరిలో ప్రారంభమై హైదరాబాద్‌లో ముగుస్తుంది. ఈ క్లస్టర్ 3 పార్లమెంటులు, 21 అసెంబ్లీలను కవర్ చేస్తుంది. కాకతీయ-భద్రకాళి క్లస్టర్ భద్రాచలం నుంచి ప్రారంభమై ములుగులో ముగుస్తుంది 3 పార్లమెంట్‌లు, 21 అసెంబ్లీలను కవర్ చేస్తుంది కాకతీయ-భద్రాద్రి క్లస్టర్ యాత్ర ఫిబ్రవరి 25న ప్రారంభమవుతుంది. మక్తల్‌లో ప్రారంభమై నల్గొండలో ముగిసే కృష్ణమ్మ క్లస్టర్ 3 పార్లమెంట్‌లు, 21 అసెంబ్లీలను కవర్ చేస్తుంది. ఈ యాత్రల్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌ తదితరులు పాల్గొంటారు.

Next Story