సైనికులకు సంఘీభావంగా రేపు బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ: కిషన్‌రెడ్డి

ఆపరేషన్ సింధూర్ లక్ష్యాలు నెరవేరాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు

By Knakam Karthik
Published on : 16 May 2025 2:07 PM IST

Telangana, Hyderabad News, Operation Sindoor, Union Minister Kishanreddy

సైనికులకు సంఘీభావంగా రేపు బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ: కిషన్‌రెడ్డి

ఆపరేషన్ సింధూర్ లక్ష్యాలు నెరవేరాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సైనికులకు సంఘీభావంగా రేపు చేపట్టనున్న తిరంగా ర్యాలీకి సంబంధించి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ..భారత ఆర్మీని అన్ని రకాలుగా బలోపేత చేశాం. సైనికులకు సంఘీభావంగా తిరంగా యాత్ర రేపు ట్యాంక్ బండ్‌పై నిర్వహిస్తున్నాం. అంబేద్కర్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ పైన ఆర్మీ ట్యాంక్ వరకు ర్యాలీ ఉంటుంది. గత నెల 22న పహాల్గంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన దేశస్తులను చంపడం జరిగింది. ఈ సంఘటన మానవత్వానికి సవాలుగా ఈ సంఘటన జరిగింది. పేర్లు అడిగి, విభజన చేసి కొడుకు ముందే తండ్రిని, భార్య ముందే భర్తను చంపటం ప్రపంచంలోనే మొదటి సారి జరిగింది.

ఉగ్రవాదాన్ని, దాన్ని సమర్ధించే వ్యక్తులను మట్టిలో కలిపివేస్తాం అని ప్రధాని మోడీ చెప్పారు. ఉగ్రవాద స్థావరాలను ఆపరేషన్ సిందూర్‌తో నేలమట్టం చేశాం. ఆపరేషన్ సింధూర్ ను విజయవంతం చేయడం జరిగింది. హైదరాబాద్‌తో సహా అనేక రాష్ట్రాల్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడి జరిగింది మనమే సాక్షం. సచివాలయం ముందు లుంబిని పార్క్, గోకుల్ చాట్, దిల్ సుఖ్‌నగర్ సాయిబాబా టెంపుల్ బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఇప్పుడు మిస్సైల్ దాడి చేసే వరకు మోడీ నాయకత్వంలో ఎదిగాం. అనేక దాడుల్లో చాలా నష్టపోయినా గులాబి పూలకు మాత్రమే పరిమితం అయ్యాం. కానీ ఇప్పుడు పాకిస్తాన్ గడ్డ మీదకి వెళ్లి ఉగ్రవాదులను ,ఉగ్రవాద సంస్థలను ధ్వంసం చేసిన చరిత్ర మన భారత సైన్యానిది. 23 నిమిషాల్లో ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం. పాకిస్తాన్ తోక ఆడించి డ్రోన్స్ పంపిస్తే తిప్పికొట్టాం. పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలను ధ్వంసం చేశాం.

భారత్‌ పై దాడి చేస్తే ప్రతిదాడి ఏ విధంగా ఉంటుందో ప్రపంచానికి తెలియచేశాం. 1960 లో సింధు జలాల ఒప్పందం రద్దు చేశాం. ఉగ్రవాదాన్ని పోషించే దేశానికి ఒక్క చుక్క నీరు ఇవ్వం అని తేల్చిచెప్పడం జరిగింది. పాకిస్తాన్‌కు గుణపాఠం నేర్పడం జరిగింది .పాకిస్తాన్ తప్పుడు ప్రచారాలు చేస్తుంది. ఆపరేషన్ సింధూర్ తాత్కాలికంగా మాత్రమే ఆగింది అని భారత్ ప్రభుత్వం ప్రకటించింది..అని కిషన్ రెడ్డి అన్నారు.

Next Story