ఆందోల్ నుంచి బాబూ మోహన్‌కు టికెట్.. బీజేపీ మూడో జాబితా
బీజేపీ మెుత్తం 35 మందితో మూడో లిస్టును రిలీజ్ చేసింది.
By Srikanth Gundamalla Published on 2 Nov 2023 2:45 PM ISTఆందోల్ నుంచి బాబూ మోహన్‌కు టికెట్.. బీజేపీ మూడో జాబితా
తెలంగాణ ఎన్నికలు ఈ నెల 30వ తేదీన జరగున్నాయి. ఈ మేరకు పార్టీలో ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పూర్తిస్థాయి అభ్యర్థులను ఖరారు చేయిగా, కాంగ్రెస్ వంద స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక బీజేపీ మాత్రమే ఇప్పటి వరకు రెండు జాబితాల్లో కలిపి 53 అభ్యర్థులను ప్రకటించింది. పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో అభ్యర్థులను మరింత జనాల్లోకి తీసుకెళ్లేందుకు అన్ని కసరత్తుల తర్వాత బీజేపీ మూడో జాబితాను విడుదల చేసింది. 35 మందితో మూడో లిస్ట్‌ను విడుదల చేసింది బీజేపీ.
సుదీర్ఘ కసరత్తు అనంతరం అభ్యర్థుల మూడో జాబితాను బీజేపీ విడుదల చేసింది. మెుత్తం 35 మందితో మూడో లిస్టును రిలీజ్ చేసింది. ఈసారి పలువురు పార్టీ సీనియర్ నేతలు, కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లు కేటాయించింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన అంబర్ పేట నియోజకవర్గం నుంచి కృష్ణ యాదవ్ బరిలోకి దిగుతున్నారు. ఆంథోల్ నుంచి బాబుమోహన్‌కు టికెట్ ఇచ్చారు. అయితే.. బీజేపీపై బాబుమోహన్ అసంతృప్తిలో ఉన్న విషయం తెలిసిందే. పార్టీ నుంచి టికెట్ వచ్చిన పోటీ చేయనంటూ కామెంట్స్ చేశారు. మరి పార్టీ మాత్రం ఆయనకు టికెట్ కేటాయించింది. దాంతో.. బాబుమోహన్ నిర్ణయం మార్చుకుంటారా? అని చర్చ జరుగుతోంది. ఇక ఉప్పల్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్, సనత్ నగర్ నుంచి మర్రి శశిధర్ రెడ్డికి టికెట్ దక్కించుకున్నారు. మూడో జాబితాలో ఒకే ఒక్క మహిళకు టికెట్ కేటాయించారు. హుజూర్ నగర్ నుంచి శ్రీలతారెడ్డికి ఛాన్స్ ఇచ్చారు.
తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీ మూడో జాబితా విడుదల 35 మంది అభ్యర్థులతో మూడో జాబితా విడుదల చేసిన బీజేపీ pic.twitter.com/mwoLTID8u2
— Newsmeter Telugu (@NewsmeterTelugu) November 2, 2023