మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ అధ్యక్షుడి రియాక్ష‌న్‌ ఇదే..!

మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పందించారు.

By -  Medi Samrat
Published on : 13 Feb 2026 7:40 PM IST

మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ అధ్యక్షుడి రియాక్ష‌న్‌ ఇదే..!

మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పందించారు. శుక్రవారం నాంపల్లిలోని పార్టీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారాయన. తెలంగాణలో బీజేపీ బలం పెరిగిందని, బీఆర్ఎస్ ఓట్ల శాతం భారీగా తగ్గిందన్నారు. మాకు 20 శాతం ఓట్లు పెరిగాయని స్పష్టం చేశారు. మజ్లిస్ డైరెక్షన్‌లో ముస్లిం ఓటర్లు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ఓటు వేశారని రాంచందర్ రావు విమర్శించారు. చాలా వార్డుల్లో 2 నుంచి 25 ఓట్ల తేడాతోనే ఓడిపోయామన్నారు.

కొత్తగూడెం, వైరాలో తొలిసారి విజయం సాధించామని తెలిపారు. అధికార దుర్వినియోగం, పోలీసుల దౌర్జన్యాలతో కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో గెలిచిందని అన్నారు. తెలంగాణ మున్సిపల్ ఫలితాల్లో చాలా చోట్ల హంగ్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాదాపు 28 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన ప్యాజిక్ ఫిగర్ దక్కలేదు. స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీ అభ్యర్థులను తమ వైపు తిప్పుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి

Next Story