హైకోర్టును ఆశ్రయించిన ఈటల రాజేందర్

తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

By Medi Samrat  Published on  27 Jan 2025 6:53 PM IST
హైకోర్టును ఆశ్రయించిన ఈటల రాజేందర్

తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఏకశిలానగర్‌లో రియలెస్టేట్ వ్యాపారిపై రాజేందర్‌ దురుసుగా ప్రవర్తించాడు. వాచ్‌మెన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంపీపై పోచారం పోలీసులు దాడి, అక్రమ నిర్బంధం తదితర అభియోగాల కింద కేసు నమోదు చేశారు.

ఏకశిలానగర్‌లో సామాన్యుల భూమిని కబ్జా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, పైగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు గూండాలను, కుక్కలను పెట్టి ఏకశిలానగర్ వాసులను బెదిరిస్తున్నారన్నారు ఈటల రాజేందర్. ఈ క్రమంలోనే వారి వద్దకు వెళ్లిన సమయంలో వారి తీరు పట్ల ఆగ్రహంతో చేయి చేసుకున్నట్లు ఈటల తెలిపారు. అయితే రియాల్టీ వ్యాపారిపై దాడి నేపథ్యంలో పోచారం పోలీసులు కేసు నమోదు చేశారు. వాచ్‌మన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఈటల రాజేందర్ హైకోర్టును ఆశ్రయించారు. పోచారం పీఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు.

Next Story