ఆపండి మీ డ్రామాలు, అమలు చేయండి కామారెడ్డి డిక్లరేషన్: అరుణ
ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ల ధర్నాపై బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శలు చేశారు.
By Knakam Karthik
ఆపండి మీ డ్రామాలు, అమలు చేయండి కామారెడ్డి డిక్లరేషన్: అరుణ
ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ల ధర్నాపై బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శలు చేశారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. మీకు చిత్తశుద్ది ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించండి. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక.. బీజేపీని బద్నాం చేస్తామంటే ఊరుకోము. చిత్తశుద్ది ఉంటే.. ఇచ్చిన మాట ప్రకారం 42శాతం రిజర్వేషన్లు పూర్తిగా బీసీలకే ఇవ్వండి. ఇందులో 10శాతం ముస్లిం మైనార్టీలకు ఇస్తామనడం బీసీలను మోసం చేయడం కాదా..? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. అందుకే బీసీ రిజర్వేషన్ల పేరుతో మరోసారి డ్రామాలు చేస్తోంది. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ.. కాంగ్రెస్‌కు ఇలాంటివి కామనే. ఢిల్లీలో కాంగ్రెస్ బీసీ ధర్నా అందులో భాగమే...అని డీకే అరుణ విమర్శించారు.
కాంగ్రెస్ ఎప్పట్నుంచో బీసీలకు వ్యతిరేకమే. బీసీలను ఓటు బ్యాంకుల రాజకీయంగా వాడుకున్నది కాంగ్రెస్ కాదా..? ఎన్నికలొచ్చినప్పుడల్లా బీసీ రాగం ఎత్తుకోవడం వీళ్లకు అలవాటే. మీకు దమ్ముంటే ఎన్నికలకు ముందు కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ ను అమలు చేయండి. అంతేగాని ఓట్ల కోసం ఢిల్లీలో ధర్నాలు చేస్తాం, బీజేపీ బద్నాం చేస్తామంటే ఊరుకునే పరిస్థితి లేదు. ఆ భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటమి భయం పట్టుకుంది. బీజేపీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. 42 శాతం బీసీలకు రిజర్వేషన్లలో 10శాతం ముస్లిం మైనార్టీలకు అంటే మీరు బీసీలను మోసం చేసినట్లు కాదా..? దీనికి కాంగ్రెస్ పార్టీ నేతలు సమాధానం చెప్పాలి..అని డీకే అరుణ డిమాండ్ చేశారు.