గులాంగిరి చేసిన వారికే పోస్టులా? రాజాసింగ్ సంచలన కామెంట్స్
బీజేపీ అధిష్టానంపై గోషామహల్ రాజాసింగ్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik
గులాంగిరి చేసిన వారికే పోస్టులా? రాజాసింగ్ సంచలన కామెంట్స్
హైదరాబాద్ స్థానిక సంస్థల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎస్.గౌతమ్‌రావును అధిష్ఠానం ప్రకటించింది. బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. కాగా, మే 1వ తేదీతో ఎమ్మెల్సీ ప్రభాకర్ పదవీకాలం ముగియనుంది. దీంతో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఏప్రిల్ 23న పోలింగ్, ఏప్రిల్ 25న ఓట్లు లెక్కింపు జరుగుతాయి. ఈరోజే నామినేషన్లకు చివరి తేదీ కాగా, ఏప్రిల్ 7న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 9న నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి గడువు. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
అయితే బీజేపీ అధిష్టానంపై గోషామహల్ రాజాసింగ్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావును ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అన్ని పోస్టులు మీ పార్లమెంట్ నియోజకవర్గంలో సభ్యులకే వస్తాయా? మిగా పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీ కార్యకర్తలు లేరా? సీనియర్స్ కనబడుట లేరా? మీకు గులాంగిరి చేసిన వారికే పోస్టులు, పదవులా? మిగతా వాళ్లు మీకు గులాంగిరి చేయరు? అందుకే వాళ్లను పక్కకు పెడుతున్నారు..అంటూ హాట్ కామెంట్స్ చేశారు.