సీఎం కేసీఆర్ ప్రస్టేషన్‌కు గురై మాట్లాడుతున్నారు.. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు.!

BJP MLA raghunandan serious comments on cm kcr. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ నిన్న తీవ్ర విమర్శలు చేశాడు. తాజాగా సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ ఎ

By అంజి  Published on  8 Nov 2021 5:33 AM GMT
సీఎం కేసీఆర్ ప్రస్టేషన్‌కు గురై మాట్లాడుతున్నారు.. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు.!

బీజేపీ, కేంద్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ నిన్న తీవ్ర విమర్శలు చేశాడు. తాజాగా సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు స్పందించారు. ప్రజల అటెన్షన్‌ను మార్చేందుకు బీజేపీని తిట్టడం సీఎం కేసీఆర్‌ ఫ్యాషన్‌ అయిందని విమర్శించారు. గత ఏడు సంవత్సరాలలో ఎప్పుడు కోపం, ఆవేదన వచ్చినా ఇలాగే ప్రవర్తిస్తూ వస్తున్నారని అన్నారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికలో ఓటమితో కేసీఆర్‌ తీవ్ర అసహనంలో ఉన్నట్లు తెలుస్తోందన్నారు. బీజేపీని ఎదుర్కోవడం కష్టమని తెలిసే కేసీఆర్‌ ఇలా ప్రష్టేషన్‌కు లోనైతున్నారని రఘునందన్‌ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా వరి ధాన్యం కొనం అని చెప్పలేదని అన్నారు. బాయిల్డ్‌ రైస్‌ మాత్రమే కొనం అని కేంద్రం చెప్పిందని వివరించారు. నచ్చితే ఓ రకం, నచ్చక పోతే ఇంకో రకంగా మాట్లాడటం కరెక్ట్‌ కాదన్నారు.

రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తే అడగాలని, నిలదీయాలని దాన్ని మేం ఎప్పుడూ స్వాగతిస్తామని రఘునందన్‌ రావు అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తప్పు చేసిన వారికి తప్పక శిక్ష పడుతుందన్నారు. చాలా మంది సీఎంలు తప్పు చేసి అరెస్ట్‌ అయ్యారని రఘునందన్‌ రావు గుర్తు చేశారు. తప్పు చేస్తే కేంద్రం ప్రభుత్వం అరెస్ట్‌ చేస్తుందని మాత్రమే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారని పేర్కొన్నారు. ఢిల్లీకి వెళ్లి కావాల్సిన పని చేసుకోవడం.. ఇక్కడ తమతో గొడవకు దిగడం సరికాదన్నారు. ఇక పెట్రోల్‌ ధరల విషయంలో మిగతా రాష్ట్రాలు ధరల పెంచలేదని.. అయినా వారు తగ్గించారని.. మీరు ఎందుకు తగ్గించరని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే రఘునందన్‌ ప్రశ్నించారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో సమావేశం అయినా తర్వాత భవిష్యత్‌ కార్యచరణ ప్రకటిస్తామని రఘునందన్‌ తెలిపారు.

Next Story
Share it