లీకేజీలపై బీజేపీ నేత విజయశాంతి ఫైర్

BJP leader Vijayashanti fire on Exam Paper leaks. టెన్త్ హిందీ ప‌రీక్ష ప్రశ్నాప‌త్రం వాట్సాప్‌ల్లో చ‌క్కర్లు కొడుతుండ‌టం చ‌ర్చనీయాంశంగా మారింది.

By M.S.R  Published on  4 April 2023 11:04 AM GMT
లీకేజీలపై బీజేపీ నేత విజయశాంతి ఫైర్

టెన్త్ హిందీ ప‌రీక్ష ప్రశ్నాప‌త్రం వాట్సాప్‌ల్లో చ‌క్కర్లు కొడుతుండ‌టం చ‌ర్చనీయాంశంగా మారింది. ప‌రీక్ష ప్రారంభ‌మైన కొద్ది నిముషాల్లోనే హిందీ ప‌రీక్ష ప్రశ్నా ప్రతాలు సోష‌ల్ మీడియాలో క‌నిపించ‌డంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతూ ఉన్నారు.

తెలంగాణలో పేపర్ లీకేజీలపై బీజేపీ నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. తెలంగాణలో విద్యార్థిగా, ఉద్యోగార్ధిగా బతకడమంటే దినదినగండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్టుగా పరిస్థితిలా మారిపోయిందన్నారు. రాష్ట్ర పాలకుల బాధ్యతారాహిత్యం వల్ల మొన్నటికి మొన్న ప్రభుత్వ ఉద్యోగాలకి పరీక్షలు పెట్టే టీఎస్‌పీఎస్‌సి ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని అన్నారు. ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన తొలి రోజే తెలుగు పరీక్ష ప్రశ్నాపత్రం, ఈ రోజున హిందీ పేపర్ లీకయ్యాయని అన్నారు. ఎక్కడా కట్టుదిట్టమైన చర్యలు లేవని, భద్రతా వ్యవస్థలు లేవని విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలంటే ప్రభుత్వానికి ఒక ఆటగా మారిపోయిందని.. ఎంతో మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నప్పటికీ ఈ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు.

లీకేజీ వ్యవహారంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆమె ఆరా తీశారు. ప్రశ్నపత్రం లీక్‌ కాలేదని వరంగల్‌, హనుమకొండ జిల్లాల డీఈవోలు మంత్రికి తెలిపారు. పరీక్షలు సజావుగా సాగుతున్నాయని, నిజాలు తేల్చేందుకు వరంగల్‌ సీపీకి ఫిర్యాదు చేయాలని డీఈవోలను మంత్రి సబిత ఆదేశించారు.


Next Story