దమ్ముంటే బండి సంజయ్‌ను విడుదల చేసి పాదయాత్రకు అనుమతించండి

BJP Leader Jeevitha Fire On TRS Govt. సినీ నటి జీవిత మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయిన సంగతి తెలిసిందే

By Medi Samrat  Published on  24 Aug 2022 12:47 PM GMT
దమ్ముంటే బండి సంజయ్‌ను విడుదల చేసి పాదయాత్రకు అనుమతించండి

సినీ నటి జీవిత మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయిన సంగతి తెలిసిందే..! భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్న ఆమె టీఆర్ఎస్ పై విమర్శల వర్షం కురిపిస్తూ ఉన్నారు. తాజాగా ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను టార్గెట్ చేశారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన దీక్షలో జీవిత పాల్గొని.. టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమానికి ముందు కేసీఆర్ కుటుంబానికి ఉన్న ఆస్తులు ఎన్ని? ఇప్పుడు ఉన్న ఆస్తులు ఎన్ని? అని ఆమె ప్రశ్నించారు.

పబ్బులు, క్లబ్బుల్లో కేటీఆర్ కు వాటాలు ఉన్నాయని, ఈ విషయాన్ని తనకు చాలా మంది పబ్బులు, క్లబ్బుల యజమానులు చెప్పారని అన్నారు. తెలంగాణలో నియంత పాలన కొనసాగుతోందని.. బండి సంజయ్ ను అరెస్ట్ చేయడం సరి కాదని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి దమ్ముంటే బండి సంజయ్ ను విడుదల చేసి, పాదయాత్రకు అనుమతించాలని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తప్పు చేయనప్పుడు.. అసలు వాస్తవం ఏమిటో చెప్పాలని అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదని జోస్యం చెప్పారు.


Next Story
Share it