బండి సంజయ్ రిమాండ్ రద్దు.. వెంటనే విడుదల చేయాలి : హైకోర్టు

BJP Leader Bandi Sanjay Remand Cancelled. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రిమాండ్ ను హైకోర్టు రద్దు చేసింది. జుడిషియల్ రిమాండ్ పై

By Medi Samrat  Published on  5 Jan 2022 10:25 AM GMT
బండి సంజయ్ రిమాండ్ రద్దు.. వెంటనే విడుదల చేయాలి : హైకోర్టు

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రిమాండ్ ను హైకోర్టు రద్దు చేసింది. జుడిషియల్ రిమాండ్ పై హైకోర్టు స్టే విధించి.. వ్యక్తిగత పూచి 40 వేల బాండ్ పై విడుదల చేయాలని జైళ్ల శాఖ ఐజీని హైకోర్టు ఆదేశించింది. వెంటనే బండి సంజయ్ ని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. బుధవారం సంజయ్ తరపు న్యాయవాది దేశాయ్ ప్రకాశ్ రెడ్డి వాదనలకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ మేరకు బండి సంజయ్ ను వెంటనే విడుదల చేయాలంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది బీజేపీ లీగల్ సెల్ వెల్లడించింది. సంజయ్‌ను విడుదల చేయాలని హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని బీజేపీ నేతలు తెలిపారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో ఇవాళ సాయంత్రం బండి సంజయ్ కుమార్ విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కరీంనగర్ లో జాగరణ దీక్ష చేపట్టిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. బండి సంజయ్‌కి బెయిల్ ఇచ్చేందుకు కరీంనగర్ కోర్టు నిరాకరించింది. బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి, బండి సంజయ్‌కి 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో ఆయనను కరీంనగర్ జైలుకు తరలించారు. బండి సంజయ్‌పై కరీంనగర్ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కోవిడ్ నిబంధనల ఉల్లంఘన, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంపై బండి సంజయ్ సహా మొత్తం 12 మందిపై కేసులు నమోదు అయ్యాయి.


Next Story