బండి సంజయ్ కాలికి గాయం
BJP leader Bandi Sanjay Leg get injured.తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గాయపడ్డారు. ప్రజా సంగ్రామ
By తోట వంశీ కుమార్ Published on 30 Aug 2021 1:34 PM ISTతెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గాయపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నిన్న లంగర్ హౌస్ వద్ద ఉన్నప్పుడు ఆయన కాలికి గాయమైంది. ఆయన్ను కలిసేందుకు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పోటి పడడంతో అక్కడ తోపులాట జరిగింది. ఈ క్రమంలో సంజయ్ కిందపడిపోయారు. ఆయన కుడి కాలుకి గాయమైంది. అక్కడే వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. కాగా.. కాలికి గాయం అయినా కూడా తన పాదయాత్రను యాధావిధిగా కొనసాగిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. బండి సంజయ్ పాదయాత్ర నేటితో మూడో రోజుకు చేరుకుంది. ఈ రోజు మొత్తం 13 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. కాగా.. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతుందని ఆరోపించారు. తెరాస, ఎంఐఎం రెండూ ఒకటేనన్నారు. మజ్లిస్‌తో కలిసి టీఆర్ఎస్ నేతలు స్థలాలు కబ్జాలు చేసి ఫంక్షన్ హాళ్లు కడుతున్నారని ఆరోపించారు. ఉప ఎన్నిక వస్తేనే కేసీఆర్ వస్తున్నారన్నారు. రాష్ట్రంలో తాను చేస్తోన్న పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకునే అవకాశం వచ్చిందన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా ప్రజలు తమ సమస్యలను చెబుతున్నారని తెలిపారు. పేదల గురించి ఆలోచించే పరిస్థితిలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం లేదని విమర్శించారు.