సీఎం కేసీఆర్ 'క్యాన్సర్' కంటే వెరీ డేంజర్ : బండి సంజయ్

సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.

By Medi Samrat  Published on  23 Aug 2023 8:00 PM IST
సీఎం కేసీఆర్ క్యాన్సర్ కంటే వెరీ డేంజర్ : బండి సంజయ్

సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్ల పాలనలో ప్రజలకు కేసీఆర్ ఒరగబెట్టిందేమీ లేదని.. కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థులు దండుపాళ్యం ముఠా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి కంటే.. సీఎం కేసీఆర్ వెరీ డేంజర్ అని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో రెండు సార్లు అధికారంలో ఉండి నట్టేట ముంచిన బీఆర్ఎస్‌కు ఓటు వేస్తారా..? మీ కోసం ఉద్యమాలు చేసి జైళ్లకు పోతున్న బీజేపీకి ఓటేస్తారా అని ప్రశ్నించారు.వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఓడిస్తారని కేసీఆర్‌కు ముందే తెలిసిపోయిందన్నారు.

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బండి సంజయ్ ఆగస్టు 23న బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ పోలింగ్​బూత్​మేళ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బండి సంజయ్​ ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్​ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని.. త్వరలోనే ప్రజలు వారికి బుద్ధి చెబుతారని విమర్శించారు. పార్టీ శ్రేణులు ఎన్నికలకు సమాయత్తం కావాలని సూచించారు. బూత్​మేళలో భాగంగా చేవెళ్ల కూడలి నుంచి సీహెచ్​ఆర్​గార్డెన్స్​వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

Next Story