ఫోన్ ట్యాపింగ్ నేపథ్యంలో బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలి: కిషన్‌రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిమాట్లాడారు.
By Srikanth Gundamalla Published on 4 April 2024 6:15 PM ISTఫోన్ ట్యాపింగ్ నేపథ్యంలో బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలి: కిషన్‌రెడ్డి
గురువారం హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాట్లాడారు. బీఆర్ఎస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని కిషన్‌రెడ్డి ఆరోపణలు చేశారు.
ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడి ప్రయివేటు వ్యక్తులను బెదిరించి డబ్బులు వసూలు చేశారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బీఆర్ఎస్ ముఖ్యనేతలపై ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసుల విచారణ జరుగుతోందని చెప్పారు. ఇప్పటికే దర్యాప్తులో భాగంగా ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారని తేలిందని చెప్పారు. అయితే.. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడి దేశ భద్రతకు భంగం కలిగేలా వ్యవహరించారని కిషన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. పారిశ్రామిక వేత్తలు, వ్యాపారస్తులు, సమాజంలోని ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అంతేకాదు.. రాజకీయాలతో సంబంధం లేనివారి ఫోన్లను కూడా ట్యాప్ చేశారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోందని కిషన్‌రెడ్డి అన్నారు. ఇది చాలా తీవ్రమైన అంశమనీ.. అలాగే ఫలితాలు తీవ్రంగానే ఉంటాయని హెచ్చరించారు. ప్రతిపక్షాల ఫోన్లను ఇష్టారాజ్యంగా, అక్రమంగా ట్యాప్ చేశారని కిషన్‌రెడ్డి అన్నారు. అంతేకాదు.. ఫోన్ ట్యాపింగ్‌ల ద్వారా బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. ఉపఎన్నికల సమయంలో తమ అభ్యర్థుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ గుర్తింపుని రద్దు చేయాలని కిషన్‌రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. అయితే.. ఈ విషయంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు కూడా చేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు.