టంగ్ స్లిప్పైన‌ వ్యాఖ్యాత.. నెట్టింట సెటైర్ల మోత‌..!

BJP commentator introduces Amit Shah as ‘martyr’ of Telangana at public meeting. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అమిత్ షా కు పాదరక్షలను

By Medi Samrat  Published on  22 Aug 2022 6:41 PM IST
టంగ్ స్లిప్పైన‌ వ్యాఖ్యాత.. నెట్టింట సెటైర్ల మోత‌..!

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అమిత్ షా కు పాదరక్షలను అందిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరొక ఫుటేజ్ కూడా ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. బీజేపీ తరపున సభలో మాట్లాడిన వ్యాఖ్యాత కేంద్ర హోంమంత్రిని తెలంగాణకు చెందిన 'అమరవీరుడు' అని పరిచయం చేస్తూ వేదికపైకి స్వాగతం పలికారు.

మునుగోడులో కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించేందుకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా ను వేదికపైకి స్వాగతం పలుకుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు వినిపించాయి. ఈ వీడియో కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కొందరు దీనిపై కామెడీగా పోస్టులు పెడుతూ ఉంటే.. మరికొందరు పార్టీ సభ్యులు కనీసం పట్టించుకోలేదని ఎత్తిచూపారు. మునుగోడులో ఉప ఎన్నికలకు ముందు ఆదివారం జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. ఆదివారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన, బహిరంగ సభలో పాల్గొనేందుకు హెలికాప్టర్‌ లో మునుగోడుకు చేరుకున్నారు.



Next Story