బీఆర్ఎస్ ప్రకటనతో తెలంగాణకు పట్టిన పీడ నేటితో విరగడయింది : బండి సంజయ్

BJP Cheif Bandi Sanjay Fire On KCR. నేను ఏబీవీపి కార్యకర్తగా ఉన్నప్పుడు మెట్‌ప‌ల్లి, జగిత్యాల, కోరుట్ల, కరీంనగర్‌లో ఎక్కువగా తిరిగాను..

By Medi Samrat  Published on  9 Dec 2022 4:24 PM IST
బీఆర్ఎస్ ప్రకటనతో తెలంగాణకు పట్టిన పీడ నేటితో విరగడయింది : బండి సంజయ్

నేను ఏబీవీపి కార్యకర్తగా ఉన్నప్పుడు మెట్‌ప‌ల్లి, జగిత్యాల, కోరుట్ల, కరీంనగర్‌లో ఎక్కువగా తిరిగాను.. ఇది పవర్ఫుల్ గడ్డ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్ర‌జా సంగ్రామ యాత్రలో ఆయ‌న మాట్లాడుతూ.. విద్యా రంగ సమస్యల కోసం యుద్ధం చేసి, నక్సలైట్ల చేతిలో అమరుడయ్యారు పుదారి మధుసూదన్ గౌడ్.. బాడీలో బుల్లెట్ దిగినా... భారత్ మాతాకీ జై అంటూ.. ప్రాణాలు అర్పించిన గొప్ప వ్యక్తులు బీజేపీ వాళ్ళని.. మెట్‌ప‌ల్లి గడ్డలో పౌరుషం ఉండకపోతే, ఇంకా వేరే ఏమైనా ఉంటుందా? అని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ బీఆర్ఎస్ ప్రకటనతో.. తెలంగాణకు పట్టిన పీడ నేటితో విరగడయిందని.. బీఆర్ఎస్ తో తెలంగాణకు పట్టిన శని అంతా పోయిందని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ పేరులో తెలంగాణ తీసి పడేసిండు.. దొంగ దీక్షలు.. మందు తాగుడు తప్ప కేసీఆర్ కు ఏమీ తెలియదని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ.. కేసీఆర్ నోటికి కోతలెక్కువ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పేరుతో.. తుక్డే గ్యాంగ్ అంతా కలిసింది. దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసే అందరూ ఏకమయ్యారని.. ఇక్కడే పీకలేనోడు, దేశంలో ఏం పీకుతాడు? అని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. దేశాన్ని దోచుకు తినే గుంట నక్కలంతా ఒకటయ్యారని విమ‌ర్శించారు.


Next Story